Sushmita Konidela : మెగాస్టార్‌కు షాకిచ్చిన పెద్ద కూతురు
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల పెద్ద షాక్ ఇచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల పెద్ద షాక్ ఇచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి “గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్” అనే ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించింది. ఆమె తన బ్యానర్‌పై సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాలను నిర్మించారు. కానీ, ఈ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు.
ఈసారి సుస్మిత తన తండ్రి చిరంజీవి సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం “భోళా శంకర్` సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ సినిమా, బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. కళ్యాణ్ కృష్ణ-చిరంజీవి కాంబోలో రానున్న సినిమాను సుస్మిత నిర్మించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
సుస్మితకు తాజాగా టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. పెట్టుబడి మొత్తం మేమే చేస్తాం.. లాభాల్లో వాటా ఇస్తే చాలు అంటూ సుస్మితకు ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ చిరంజీవికి కూడా నచ్చడంతో సుస్మితను ఓకే చెప్పాడట. అయితే ఆ ఆఫర్‌ను సుస్మిత తిరస్కరించింది. తన తండ్రితో కలిసి నిర్మించబోయే మొదటి సినిమాకు లాభమైనా నష్టమైనా మొత్తం పెట్టుబడి పెడతానని చెప్పింది. తండ్రి మాటను లెక్క చేయకుండా మొండిగా వ్యవహరించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు రెండు సార్లు విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.