Suriya 43: సుధా కొంగరతో ‘సూర్య43’మూవీ..టైటిల్ ఫిక్స్!
హిట్ కాంబో సూర్య, డైరెక్టర్ సుధా కొంగర మళ్లీ కలిసి మరో చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం సూర్య43 అనే టైటిల్ను ఖరారు చేశారు. అయితే టైటిల్లోని కొంత భాగాన్ని అనౌన్స్మెంట్ వీడియోలో ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా సహా కీలక నటీనటులు యాక్ట్ చేస్తున్నారు.
తమిళ్ స్టార్ హరో సూర్య(suriya) తన 43వ చిత్రం..సూరరై పొట్రు దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara)తో ఫిక్సైంది. అంతేకాదు ఈ చిత్రంలో నటినటులు, ఈ మూవీ టైటిల్ కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సూర్య రాబోయే చిత్రం గురించి మేకర్స్ 44 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా సూర్య 43 అని పేరు పెట్టారు. ఈ మూవీలో సూర్యతో పాటు, దుల్కర్ సల్మాన్(dulquer salmaan), విజయ్ వర్మ(vijay varma), నజ్రియా(nazriya nazim) కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలిపారు.
ఈ సినిమా గురించి ప్రొడక్షన్ హౌస్ 2D ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణాన్ని ‘రస్టిక్’ అని పిలిచింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తుండగా..జీవీ ప్రకాష్(gv prakash kumar) సంగీతం అందించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రకాష్ కు 100వ చిత్రం కావడం విశేషం. ఈ వీడియో విడుదలైన వెంటనే సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రముఖ నటుడు-దర్శక ద్వయం నుంచి మరో మెగా-బ్లాక్బస్టర్ వస్తుందని అంటున్నారు. అంతేకాదు ఫస్ట్ లుక్ ప్రోమోలో ఉపయోగించిన నేపథ్య సంగీతాన్ని కూడా ఓ నెటిజన్ మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి టైటిల్లోని కొంత భాగాన్ని అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. ‘పురానానూరు’లో అని వెల్లడించారు. అయితే ఈ చిత్రం స్టోరీ తమిళనాడులో 1967 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాలు, అప్పటి ప్రజల పోరాటాన్ని గుర్తు చేస్తుందని తెలుస్తోంది.