Ram Gopal Varma: నేను బయట..అతను లోపల..ఆర్జీవీ సెల్ఫీ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ ఏదో ఒక పోస్ట్ పెట్టి వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది.
Ram Gopal Varma: టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ ఏదో విధంగా వైరల్ అవుతూనే ఉంటారు. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద సంచలన ట్వీట్లు చేస్తూ లేనిపోని వివాదాల్లో జోక్యం చేసుకుంటారు. ఏం చేసినా వెరైటీగా చేయాలని అనుకుంటాడు. ఎవరు ఆలోచనలకు అందడు. ప్రతి దానిలో లాజిక్‌లు వెతుకుతుంటాడు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. అందులో ఎక్కువగా టీడీపీ, జనసేన రాజకీయ నాయకులను ఎక్కువగా విమర్శిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లి..ఆర్జీవి గేటు ముందు నిలబడి ఒక సెల్ఫీ దిగాడు. ఈ పోస్ట్‌కి ‘నేను బయట అతను లోపల’ అనే క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పలువురు చంద్రబాబును జైల్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నువ్వు జైలుకి వేళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంటున్నారు. తర్వాత నువ్వే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అక్కడి వరకు ఎలాగో వెళ్లావు కదా.. కొన్నిరోజులు ఆ జైల్లో ఉండి రా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.