పుష్ప సినిమాతో సంచలనం సృష్టించాడు సుకుమార్(Sukumar). రాజమౌళి తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియా డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయాడు. దాంతో తాజాగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్(pan India project) అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు సుకుమార్. మిగతా భాషల్లో కంటే.. పుష్ప సినిమాతో బాలీవుడ్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించాడు సుకుమార్. అందుకే ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్‌తో చేతులు కలిపాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’తో సంచలనం సృష్టించిన దర్శక, నిర్మాతలు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. అభిషేక్ అగర్వాల్‌తో సినిమా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 సినిమాలతో వరుస విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్.. దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అందుకే ఇప్పుడు మన లెక్కల మాస్టర్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫొటోలను అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని మార్చేలా.. భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియన్ సినిమాను రూపొందించబోతున్నట్లు పేర్కొన్నాడు.
దాంతో ఊహించని విధంగా.. ఈ ముగ్గురు కలిసి ఎలాంటి సినిమా చేయబోతున్నారనే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా హీరో ఎవరనేది మరింత ఎగ్జైటింగ్‌గా మారింది. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయని.. వివేక్ అగ్నిహోత్రి పోస్ట్ చేశాడు. మరి సుకుమార్ నెక్ట్స్ హీరో ఎవరు.. ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడో చూడాలి.