బాలయ్య హోస్టింగ్‌తో అన్ స్టాపబుల్ షో ఆహా ఓటిటిలో దుమ్ము దులిపేసిని సంగతి తెలిసిందే. అయితే చివరగా మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఫస్ట్ సీజన్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అందుకే ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2కు రంగం సిద్దమవుతోంది. అతి త్వరలో సెకండ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే సీజన్ 1లో ఒకరిద్దరు తప్పితే.. అంతా స్టార్ హీరో, దర్శకులే గెస్ట్‌గా వచ్చారు. మోహన్ బాబుతో మొదలైన సీజన్ 1లో రవితేజ, నాని, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, రాజమౌళి, గోపిచంద్ మలినేని, బోయపాటి శ్రీను వంటి వారు గెస్ట్‌గా అలరించారు. ఇక హీరోయిన్లలో తమ కో స్టార్స్‌తో కలిసి రష్మిక, ప్రగ్యా జైస్వాల్ వచ్చారు. కానీ సోలోగా ఒక్క హీరోయిన్ను కూడా తీసుకురాలేదు.
అయితే సీజన్ 2లో ఆ లోటును తీర్చేందుకు ఆహా టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ టాక్ షోలో ఫస్ట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అలాగే ఈసారి ప్రభాస్, పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఈ షో కోసం కొంతమంది హీరోయిన్లను కూడా తీసుకురాబోతున్నారట. ఆ లిస్ట్‌లో ముందుగా అనుష్క పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు సమాచారం. కానీ అనుష్క అందుకు ఓకే చెప్పిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ సెకండ్ సీజన్లో హీరోయిన్లు వస్తే మాత్రం.. మరింత కలర్ ఫుల్‌గా మారనుందని చెప్పొచ్చు.