»Singer Arijit Singh Injured After Excited Fan Pulls Hand During Live Concert In Maharashtra
Arijit Singh ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ కు చేదు సంఘటన.. గాయపరిచిన అభిమాని
‘మీరు పరిణతి చెందిన వ్యక్తి కదా? మరి ఇలా చేయిని లాగవచ్చునా? ఇది సరికాదు’ అర్జిత్ ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి ఆ యువతి క్షమాపణలు చెబుతూ ఉంది. కానీ అర్జిత్ తగ్గలేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను (Audience) ఉర్రూతలూగించే గాయకుడు అర్జిత్ సింగ్ (Arijit Singh). ఎక్కువగా హిందీ పాటలు (Songs) పాడుతున్నా ప్రజలందరి మనసులు గెలుచుకున్నారు. బాలీవుడ్ లో ఆయన క్రేజే వేరే. అలాంటి అర్జిత్ సింగ్ కు ఓ ఈవెంట్ (Event)లో చేదు సంఘటన ఎదురైంది. ఓ అభిమాని (Fan) అత్యుత్సాహంతో అర్జిత్ చేయిని గాయపరిచింది. దీంతో అర్జిత్ చేయి పని చేయకపోవడంతో పాటలు పాడేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
బాలీవుడ్ (Bollywood)లో స్టార్ సింగర్ అర్జిత్ సింగ్. మహారాష్ట్రలోని (Maharashtra) ఔరంగాబాద్ (Aurangabad)లో ఆదివారం సాయంత్రం ఓ లైవ్ కన్సర్ట్ (Live Concert) నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న అర్జిత్ ఉత్సాహంగా పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతూ అభిమానులను పలుకరించేందుకు స్టేజ్ (Stage) ముందుకు వచ్చాడు. ఈ సమయంలో ఓ మహిళా అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించింది. తన ముందుకు వచ్చిన అర్జిత్ చేయిని బలవంతంగా (Pull) లాగింది. కలిసిన ఆనందంలో అతడి చేయిని బలంగా నొక్కింది. షేక్ హ్యాండ్ (Shakehand) ఇస్తూ బలంగా లాగడంతో అర్జిత్ బాగా నొప్పిగా భావించాడు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో అతడి చేతికి తీవ్రమైన నొప్పి వచ్చింది.
వెంటనే చేయి విదిల్చుకుని అక్కడే ఆ అమ్మాయిపై అర్జిత్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను ప్రదర్శన చేయలేకపోతున్నా. నా చేయి వణుకుతోంది. ఇలాంటి సంఘటన సరికాదు. నేను బయటకు వెళ్లాల్నా?’ అని అర్జిత్ ప్రశ్నించాడు. దీనికి ప్రేక్షకులు ‘వద్దు’ అంటూ గట్టిగా కేకలు వేశారు. ‘మీరు పరిణతి చెందిన వ్యక్తి కదా? మరి ఇలా చేయిని లాగవచ్చునా? ఇది సరికాదు’ అర్జిత్ ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి ఆ యువతి క్షమాపణలు (Apology) చెబుతూ ఉంది. కానీ అర్జిత్ తగ్గలేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అర్జిత్ ను గాయపరిచిన ఆ యువతిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటన జరిగిన తెల్లారే అర్జిత్ సింగ్ చేతికి కట్టుతో కనిపించాడు. ఆ యువతి లాగడం వలన అర్జిత్ చేతికి గాయమైంది. కొన్ని రోజులు విశ్రాంతి (Rest) తీసుకోవాలని వైద్యులు (Doctors) సూచించినట్లు తెలుస్తోంది. అర్జిత్ సింగ్ అషికి-2 సినిమాతో అనూహ్య క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల బ్రహ్మస్త్ర సినిమాలో ‘కేసారియా’ పాటతో అందరి మది దోచుకున్నాడు. ఒక్క హిందీలోనే కాదు మన తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అర్జిత్ సింగ్ పాటలు పాడుతున్నాడు. తెలుగులో ‘ఉయ్యాల జంపాలా’, స్వామి రారా, హుషారు, భలే మంచి రోజు వంటి సినిమాల్లో పాటలు పాడాడు.
#ArijitSingh was recently injured at an Aurangabad Concert. Videos of him talking about personal space have gone #viral starting the conversation about the same.