స్టార్ బ్యూటీ సమంత గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసిన సరే.. హాట్ టాపిక్ అవుతుంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాకే పరిమితమైంది. చివరగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా(Khushi’ movie)తో ఆడియెన్స్ ముందుకొచ్చింది సామ్. దీంతో పాటు వరుణ్ ధావన్‌తో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసిన సమంత.. మయోసైటిస్ (Myositis) కారణంగా.. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది.
అంతేకాదు.. ఆ సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేసింది. చెప్పినట్టుగానే.. ఈ మధ్య విదేశాల్లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియాతో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంది. అలాగే.. అమ్మడు అమెరికా(America) కకు వెళ్లి మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుందని అనుకున్నారు. కానీ సడెన్‌గా ముంబైలో ప్రత్యక్షమైంది సమంత. తాజాగా సమంత విదేశాలు నుంచి ఇండియా తిరిగొచ్చింది. అలాగే ముంబైలో మీడియా కంట పడింది. దీంతో సామ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
మయోసైటిస్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందా? సమంత మళ్ళీ సినిమా షూటింగ్స్(Shootings)కి రెడీ అవుతోందా? అనే సందేహాలు వస్తున్నాయి. అలాగే వచ్చే ఏడాది వరకు షూటింగ్‌లు చేయదని అనుకున్న అభిమానులు.. సమంత గురించి జరిగిన ప్రచారం అంతా ఉత్తిదేనా? అని అంటున్నారు. కానీ 2024లో ఆమె కొత్త సినిమా ఒప్పందాలపై సంతకం చేయనుందని తెలుస్తోంది. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలు బయటికి రానున్నాయని అంటున్నారు. మరి సామ్ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో చూడాలి.