యూపీ (UP)లోని లలిత్పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు ఒక గ్రామంలోని కాలువలో ఓ మొసలిని పట్టుకున్నారు.అనంతరం మొసలి(Crocodile)ని తాళ్లతో కట్టేశాడు. అయితే అందులో ఓ యువకుడు మొసలిని తన భూజాలపై ఎత్తుకొని వెళ్లాడు. సమీపంలో ఉన్న నది వరకు దానిని మోసుకెళ్లాడు. ఆ భారీ మొసలిని ఆ నదిలో విడిచిపెట్టాడు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా(Social media)లో వైరల్ అయ్యింది. ఆ వ్యక్తి డేరింగ్ స్టంట్‌ను పలువురు నెటిజన్లు (Netizens) ప్రశంసించారు. బంధించిన తర్వాత భుజంపై మోసుకెళ్లి కాలువలో వదిలేశాడు. బాహుబలితో అతడ్ని పోల్చారు. మరి కొందరు మాత్రం అతడి తీరును విమర్శించారు. అటవీ శాఖ (Forest Dept) సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి సహాయంతో ఆ మొసలిని పట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి సాహసాలు ఒక్కోసారి ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరించారు.
ललितपुर-युवक ने नाले से एक मगरमच्छ को पकड़कर और अपने कंधे पर लेकर जंगल में छोड़ने के लिए उसे निकल गया..वीडियो तेजी से वायरल हो रहा है..@ForestPolicepic.twitter.com/VJ31SAEiB7