ఏపీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్మి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో వున్న చంద్రబాబు పరిస్థితిని తలుచుకుని లోకేశ్ కంటతడి పెట్టారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును ప్రభుత్వం కక్షపూరితంగా జైలులో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గత 45 సంవత్సరాలుగా క్రమశిక్షణతో, పట్టుదలతో మనందరి కోసమే ఆయన పనిచేశారని లోకేశ్ వివరించారు.అలాంటి నేతను 43 రోజులుగా రాజమండ్రి జైలు(Rajahmundry Jail)లోనే ఉంచారని చెప్పారు. ఇది కలలో కూడా ఊహించలేనిదని, తలుచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోందని లోకేశ్ ఆవేదన చెందారు.
తెలుగుదేశం-జనసేన పోరాడకుంటే రాష్ట్రాన్ని సీఎం జగన్ (CM Jagan) ముక్కలు చేసి అమ్మేసేవాడని మండిపడ్డారు. తెలుగుదేశం-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే సంపాదించాలని చంద్రబాబు భావిస్తే రాజకీయాలు అవసరం లేదన్నారు. ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా మన రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబును బంధించారని లోకేష్ అన్నారు.చివరకు మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలకు మా అమ్మ రాలేదని. అసెంబ్లీ (Assembly) సాక్షిగా ఈ సైకో జగన్, ఆయన సైన్యం ఆమెను అవమానించారని ఆయన కన్నీటి పర్యంతయ్యారు
45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేసిన చంద్రబాబు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరీ 43 రోజులుగా నిర్బంధించారు. ఇది కలలో కూడా ఊహించనిది. తలచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోంది. #FalseCasesAgainstNaidupic.twitter.com/IBtbG39hh4