దసరా పండుగ సెలవులకు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీ రాష్ట్ర రవాణా సంస్థ (AP RTC) శుక్రవారం నుంచి 1000 ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఆయుధపూజ, విజయదశమి(Vijayadashami) సెలవులు, వారాంతం శని, ఆదివారాలు వరుసగా వస్తుండటంతో గురువారం నుంచే నగరం నుంచి వివిధ నగరాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణీకుల (Passengers) రద్దీ పెరిగింది. రైళ్లలో టికెట్లు లభించనివారంతా రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ఆమ్నీ బస్సులలో స్వంత ఊళ్లకు బయలుదేరనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా సంస్థ శుక్రవారం నుంచి 1000 ప్రత్యేక బస్సులను నడుపనుంది. కోయంబేడు, మధురవాయల్ బైపాస్, తాంబరం మెప్స్ బస్‌స్టేషన్ ప్రాంతాల నుంచి 2264 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రవాణా సంస్థ అధికారులు తెలిపారు. శుక్రవారం వివిధ నగరాల నుండి సుమారు 30 వేలమంది, చెన్నై నుండి 17 వేల మంది తమ స్వంత ఊర్లకు వెళ్లేందుకు టికెట్లు రిజర్వు చేసుకున్నట్లు చెప్పారు.
విజయవాడ (Vijayawada) నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు నడిపే ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని విజయవాడ డిప్యూటీ ట్రాన్సుపోర్ట్ కమిషనర్ పురేంద్ర హెచ్చరించారు. అధిక ధరలు వసూలు చేసే ఆపరేటర్లు, బస్సులపై రవాణాశాఖ (Transport Dept) దాడులు నిర్వహిస్తోందన్నారు.దసరా పర్వదినం సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల్లో అధిక ధరలకు టిక్కెట్ విక్రయాలు జరపవద్దని సూచించారు. అధిక ధరలకు టిక్కెట్ విక్రయించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దన్నారు. ఎక్కువగా వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామన్నారు. తనిఖీల కోసం 19 బృందాలను నియమించామన్నారు.