తిరుమల శ్రీవారిని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మణ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల (Brahmotsavalu) ను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వీవీఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు.దాదాపు రూ.14 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి (Srivari) ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టీటీడీ ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల కట్ ప్లవర్స్ అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధగా గమనించారు.