»Rahul Gandhi Is Just A Paper Tiger Criticized Mlc Kavitha
MLC Kavitha: రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు.. పేపర్ పులి మాత్రమే
రాహుల్ గాంధీ బస్సు యాత్రతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమదైన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బబ్బర షర్ కాదు కేవలం పేపర్ పులి మాత్రమే అని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కవితా విరుచుకుపడింది.
Rahul Gandhi is just a paper tiger, criticized MLC Kavitha
MLC Kavitha: తెలంగాణ(Telanagana)లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళా రాజకీయం వేడెక్కుతోంది. బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణలో పర్యాటిస్తున్నారు. బహిరంగ సభల్లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ పాలనను ఎండగడుతున్నారు. ఇది ప్రజల తెలంగాణ కాదు, దొరల తెలంగాణ అని కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ మాటలపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మీడియా ముఖంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని, పేపర్ పులి మాత్రమే అన్నారు. ఆయన మాటలను ఎవరు సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఊరికే ఇవ్వలేదని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు దీక్ష చేస్తేనే సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిందన్నారు. ఉద్యమాలు, విద్యార్థుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడింది అని వ్యాఖ్యనించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి, తెలంగాణకు మధ్య విద్రోహ సంబంధం ఉందని విమర్శించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరిచి దిగజారి మాట్లాడుతున్నారని కవిత పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ హయాంలోనే న్యాయం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో బీడీ కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. ఉపాధి కోసం వెళ్లి గల్ఫ్‌లో చనిపోయిన వారికీ ప్రభుత్వ బీమా వర్తిస్తుందన్నారు. గల్ఫ్‌లో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని హామీ ఇచ్చారు.