Sai Pallavi: డైరెక్టర్గా సాయిపల్లవి.. సినిమా ఎప్పుడంటే?
సాయి పల్లవి త్వరలో మెగాఫోన్ పట్టనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ నటీ త్వరలోనే కథ సిద్దం చేసి సినిమాను తెరకెక్కించనుంది.
Sai Pallavi: మలయాళ ముద్దుగుమ్మ, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి. ఫిదా సినిమాతో అందరిని మాయ చేసిన ఈ నాట్య మయూరి తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరించింది. తెలుగు, మలయాళంతో పాటు ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో తన మనసులోని మాట బయటపెట్టింది. ఫ్యూచర్లో డైరెక్షన్ చేయాలని ఉందని చెప్పేసింది.
సినిమాల్లో నటించడం కన్నా డైరెక్షన్ చేయడం కష్టమైన పనియే అయినప్పటికీ ఒక్క సినిమాకు అయినా తాను దర్శకత్వం వహిస్తుందట. అంతే కాదు తనకు నచ్చిన ఓ అద్భుతమైన కథను కూడా సిద్ధం చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం మూలంగా కథ ఇంకా పూర్తి కాలేదని, త్వరలోనే పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఇంకా నిర్మాత ఫిక్స్ కాలేదని, త్వరలోనే దానికి సంబంధించిన అన్ని విషయాలను చెప్తా అని సాయిపల్లవి చెప్పారు. తాను నటించే సినిమాల విషయంలోనే ఎంతో శ్రద్ధ వహిస్తుంది. మనసుకు నచ్చే పాత్రలే చేస్తుంది. అలాంటిది తాను సొంతంగా రాస్తున్న మూవీ ఎలా ఇంకెలా ఉండబోతుంది అని అభిమానులు ఆరాట పడుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్యతో తండేల్ మూవీలో నటిస్తుంది. అలాగే అమిర్ ఖాన్ కొడుకు చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది.