Rani Mukherjee said that she cannot have another child
Rani Mukherjee: ఒక బిడ్డను నవమాసాలు మోసీ కనిపెంచిన తల్లి, మరో బిడ్డను కళ్ల చూడకుండానే కడుపులోనే పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణించరానిది అంటుంది బాలీవుడ్ నటీ రాణీ ముఖర్జీ. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా సినిమాల్లో అలరించిన రాణీ ముఖర్జీ గత కొంత కాలంగా అడపాదడపా చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది. గత సంవత్సరం తీవ్ర రక్తస్రావం అయి ఒక బిడ్డను పురట్లోనే కోల్పోయినట్లు తాను తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. నవమాసాలు మోసీ అపురూపంగా, అల్లారు ముద్దుగా పెంచాలి అనుకున్న బిడ్డ ప్రమాదవశాత్తు కడుపులోనే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుందని వెల్లడించింది.
ప్రస్తుతం తన వయస్సు 46 సంవత్సరాలు. తనకు పెళ్లై ఒక కూతురు కూడా ఉంది. అయితే మరో బేబీ కోసం గత ఏడు సంవత్సరాలుగా ట్రై చేశామని, చివరకి గత ఏడాది ప్రెగ్నేన్సీ వచ్చిందని.. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని భావోద్వేగం చెందింది. ఇక తాను పిల్లలను కనే వయసు కూడా దాటాను అని వెల్లడించింది. ఇలాంటి సమయంలో తన కూతురు అధీరాను బాగా చూసుకుంటే చాలాని, తన వయస్సు ఇప్పుడు 8 సంవత్సరాలు అని తెలిపింది. కానీ తనకు ఆడుకోవడానికి ఒక తమ్మున్నో, చెల్లినో ఇవ్వలేకపోయాను అనే బాధ తనను వెంటాడుతుంది అని చెప్పింది. అయితే సెలబ్రెటీలు చాలా మంది లేట్ వయస్సులో పెళ్లిలు చేసుకోవడంతో ఇలాంటి సమస్సలు వస్తున్నాయని, పిల్లలు కావాలి అనుకుంటున్న వారెవరైనా సరే త్వరగానే పెళ్లి చేసుకొని పిల్లపాపలతో సుఖంగా ఉండాలని సూచించింది.