సలార్ లేటెస్ట్ అప్టేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. అందుక సంబంధించిన ఫోటో కూడా షాక్ ఇచ్చేలానే ఉంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘సలార్’ను తెరకెక్కిస్తున్నాడు.
అందుకే ఈ సినిమా భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమాలో మళయళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇందులో కనిపించబోతున్నాడంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఓ ఫోటో కూడా ఒకటి బయటకొచ్చింది. ఇందులో ప్రభాస్ లాగే రఫ్‌గా కనిపిస్తున్నాడు రౌడీ.
దీంతో సలార్‌లో విజయ్ కూడా జాయిన్ అయ్యాడనే టాక్ ఊపందుకుంది. అంతేకాదు.. ఈ సినిమా క్లైమాక్స్‌లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుందట. అది సలార్ రెండో భాగంలో కీలక పాత్రగా మారుతుందనే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ప్రభాస్ తమ్ముడిగా విజయ్ నటిస్తున్నట్టు టాక్. అయితే ఇప్పటి వరకు సలార్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక అప్టేట్ ఇవ్వలేదు.
అయినా ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేసింది. కానీ ఈ ఫోటో వెనక అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కొత్త థమ్స్ అప్ యాడ్ షూట్లో పాల్గొంటున్నాడు. ఈ ఫోటో దానికి సంబంధించిదేనని అంటున్నారు. అంతే తప్పా.. సలార్‌లో రౌడీ ఉండే ఛాన్సెస్ లేదంటున్నారు. అయినా ఈ న్యూస్ మాత్రం క్రేజీగా మారిపోయింది. మొత్తంగా ఒక్క ఫోటోతో సలార్‌లో రౌడీని కూడా జాయిన్ చేయడం.. ఇప్పుడు కాస్త చిత్రంగానే ఉంది.