Robbery at Director Manikandan's house.. stolen National Award and Medals
Director Manikandan: కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ (Director Manikandan) ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడి దుండగులు నగదుతో పాటు, అవార్డులు సైతం దోసుకెళ్లారు. మదురైలోని ఉసిలంపట్టిలో ఉన్న ఆయన ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో దర్శకుడు చెన్నైలో ఉన్నారని మీడియాకు తెలిపారు. ఇంటి తాళాన్ని పగలగొట్టి బీరువాలో ఒక లక్ష రూపాల నగదు, ఐదు తులాల బంగారు నగలు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను దొంగలించినట్లు పోలీసులకు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫొటోగ్రాఫర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన మణికందన్ డైరెక్టర్‌గా మారారు. మణికందన్ విండ్ అనే షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దాంతో వెట్రిమారన్ సహకారంతో కాకా ముట్టై మూవీని తెరకెక్కించారు. ఇది సూపర్ హిట్ అవడమే కాకుండా 62వ జాతీయ అవార్డులలో రెండు పురస్కారాలను అందుకుంది. 13వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో ఉత్తమ ఫీచర్‌గా అవార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు.