జాతీయ అవార్డు కావాలని తానేమి కేంద్ర ప్రభుత్వానికి కోరలేదని కశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు. ఈ సినిమాని జనం మెచ్చారని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు కాబట్టే (National Award) వరించిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని తేల్చి చెప్పారు. వాస్తవాలు చూపించే సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కాగా, అంతకుముందు కశ్మీర్ ఫైల్స్ మూవీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడాన్ని విమర్శిస్తూ.. కేంద్ర ప్రభుత్వం (Central Govt) పై సీరియస్ కామెంట్స్ చేశారు. వివాదాస్పద సినిమా అయిన కశ్మీర్ ఫైల్స్‌కు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జాతీయ అవార్డులు రాజకీయాలను ప్రభావితం చేయకూడదని అన్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న చిత్రాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని సీరియస్ అయ్యారు.
ఎన్నికల వేళ కావాలనే సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా.. తమిళ ఎంసీ స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) క్లారిటీ ఇచ్చారు.దేశంలో ధర్మాన్ని కాపాడాలన్నదే మా లక్ష్యం. దేశ సమగ్రతా చిత్రంగా మా సినిమాకు అవార్డు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తే.. దేశాన్ని ప్రశ్నించినట్లే. ప్రభుత్వం ఈ అవార్డును ప్రజలకు ఇచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ సినిమాకు అవార్డులు రావడం వెనక ఎలాంటి లాబీయింగ్ లేదు. అలా చేసి ఉంటే అన్ని అవార్డులు మా సినిమాకే వచ్చేవి. అలాంటివి చేయడం నాకు తెలీదు’’ అని చెప్పారు. ఇక తెలుగు సినిమా(Telugu movie)కు అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్న అభిషేక్ .. ప్రపంచంలో టాలీవుడ్ (Tollywood) నంబర్ వన్‌లో ఉందన్నారు. తెలుగు సినిమాను రాజమౌళి అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. అల్లు అర్జున్(Allu Arjun)కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు