విజయనగరం జిల్లా సాలూరు(Salur)లో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సీఎం జగన్ (CM Jagan) శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనివర్సిటీకి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ట్రైబల్ యూనివర్శిటీ (Tribal University)మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు.
గిరిజనులు(Tribal people) స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా వారు అభివృద్ధికి దూరంగా ఉన్నారని సీఎం అన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిడ్డ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా(Financially), రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. యూనివర్శిటీ (University) నిర్మాణంతో తరతరాలు మారిపోయేలా నిర్మాణం జరుగుతుందన్నారు. నాలుగేళ్లలో కనీవిని ఎరుగని స్థాయిలో గిరిజనులకు సంక్షేమ పథకాల(Welfare schemes)ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కేంద్రం సహకారం కూడా రాష్ట్రానికి ఉండాలని సిఎం జగన్ అకాంక్ష వ్యక్తం చేశారు.యూనివర్శిటీ నిర్మాణానికి సాలూరు నియోజక వర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ పూర్తి చేశారు.
రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గిరిజన ప్రాంతంలోనే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. గిరిజన విశ్వ విద్యాలయాన్ని గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ (Mentada) మండలం చినమేడపల్లి గ్రామాల పరిధిలో భూసేకరణ జరిపి కేంద్రానికి అప్పగించారు. ప్రభుత్వ భూమిని కేటాయించడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూములిచ్చిన రైతుల(Farmers)కు రూ.29.97 కోట్ల పరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు చెల్లించింది.