»Good News For Railway Passengers 312 Special Trains To Vinayakachavithi
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..వినాయకచవితికి 312 స్పెషల్ ట్రైన్స్!
వినాయకచవితి సందర్భంగా 312 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని రైళ్లను కూడా పొడిగించనున్నట్లు తెలిపింది.
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే (Indian Railways Announces) శుభవార్త చెప్పింది. వినాయకచవితి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందరూ తమ తమ ఊర్లలో పండగ జరుపుకోవడానికి నగరాల నుంచి గ్రామాలకు పయనమవుతుంటారు. ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే చాలా స్పెషల్ ట్రైన్స్ (Special Trains) నడపనుంది.
ప్రయాణికుల (Passengers) రద్దీ దృష్ట్యా 312 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. వినాయకచవితి పండగ (vinayakachaviti Festivals) సందర్భంగా భారతీయ రైల్వే తమ ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు గణపతి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ రైల్వే, పశ్చిమ రైల్వే శాఖలు 312 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నాయి.
ప్రత్యేక రైళ్ల (Special Trains) ద్వారా 1.04 లక్షల మంది రిజర్వ్డ్ ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇందులో పశ్చిమ రైల్వే శాఖ 55 స్పెషల్ ట్రైన్స్ నడపనుండగా సెంట్రల్ రైల్వే 257 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లన్నీ కూడా ఎక్కువ భాగం మహారాష్ట్రలోని అనేక నగరాల నుంచి ముంబై నగరానికి కనెక్ట్ అవుతాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే మాత్రం వినాయకచవితి సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రత్యేక రైళ్ల వివరాలను వెల్లడించనుంది.