»A 16th Century Buddha Statue Worth Crores Was Stolen From The Barakat Art Gallery In Los Angeles Usa
Buddha statue: రూ.12 కోట్ల విలువైన బుద్ద విగ్రహం కొట్టేశారు
అగ్రరాజ్యం అమెరికాలో కాస్లీ బుద్ధ విగ్రహం చోరీకి గురైంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ పలువురు వ్యక్తులు వచ్చి దొంగతనం చేశారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
A 16th century Buddha statue worth crores was stolen from the Barakat Art Gallery in Los Angeles, USA.
Buddha statue: అమెరికా(America) లాస్ ఏంజెల్స్ లో(Los Angeles)ని బరాకత్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న అరుదైన బుద్ధ విగ్రహం(Buddha statue) చోరీకి గురైంది. అయితే ఆ కాంస్య విగ్రహం విలువ 12.5 కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే ఆ ప్రతిమ జపాన్(Japan)కు చెందిన పురాతనమైన విగ్రహం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జపాన్‌లోని ఇడోకాలం (1603-1867) నాటిదని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. దాదాపు నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహానికి తల చుట్టూ కాంతి కోసం ప్రత్యేకంగా లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.
సుమారు 55 సంవత్సరాలుగా ఈ విగ్రహం ఈ గ్యాలరీలోనే ఉంటుందని, మొత్తం ఈ గ్యాలరీలో ఉన్న అన్ని కళాఖండాలలోనూ ఇదే చాలా ఆకర్షణీయమైనదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆదివారం తెల్లవారు జామున సమయం 3.45 గంటల ప్రాంతంలో ఈ విగ్రహం చోరీకి గురైంది. ఒక వ్యాన్‌లో నలుగురు వ్యక్తులు గేట్‌ను తోసేసుకుని గ్యాలరీలోకి ప్రవేశించారు. అక్కడి రక్షణ వలయాన్ని ఛేదించుకుని 25 నిమిషాల్లోనే విగ్రహాన్ని దోచుకెళ్ళారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఆర్ట్ గ్యాలరీని అమెరికాలో అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భావిస్తారు. అలాంటిది అక్కడి నుంచే వారు కాజేశారంటే ఇది ఎన్నో రోజుల ప్లానింగో అని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు దర్యార్తు చేస్తున్నారు.