Ram Gopal Varma: రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. వివాదస్పదంగా ఏదో ఒక ట్వీట్ చేస్తుంటాడు. అందులో ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం దొరికినప్పుడల్లా వర్మ విమర్శలు చేస్తుంటారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేదని వర్మ సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశాడు. ఆర్యభట్ట గణితశాస్త్రంలో సున్నాని ఆవిష్కరిస్తే.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడని ట్వీట్ చేశాడు. జనసేన ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైందని విమర్శిస్తూ ఈ విధంగా ట్వీట్ చేశారు.
జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా.. అన్ని చోట్ల కూడా డిపాజిట్లు కోల్పోయింది. కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మాత్రమే చెప్పుకోగిన ఓట్లు వచ్చాయి. మిగతా ఏడు చోట్ల కూడా అభ్యర్థులకు ఓట్లు పడలేదు. కూకట్‌పల్లితో పాటు ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాండూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా జనసేన అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు.