Revanth: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth) గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీలు, మంత్రులు కూడా బాధ్యతలు చేపడతారు. ఆ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గురువారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. పోలీసు శాఖ ఉన్నతాధికారులతో బందోబస్త్ గురించి సీఎస్ డిస్కష్ చేశారు. సమావేశంలో డీజీపీ రవి గుప్తా పాల్గొని పలు సూచనలు చేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శి శేషాద్రి కూడా పాల్గొన్నారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. పీసీసీ చీఫ్ సీఎంగా ప్రమాణం చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.