ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. దాంతో అప్ కమింగ్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్(ram charan).. ఒక్కో సినిమాతో మెగాస్టార్ క్రేజ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమా తర్వాత జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లైన్లో ఉన్నాడు. ఇలా చరణ్‌కు భారీ లైనప్ ఉంది. ఇక భారీ సినిమాలతో దూసుకుపోతున్న చరణ్.. సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నాడు. మిగతా స్టార్ హీరోల కంటే కాస్త లేట్‌గానే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు చరణ్.
ఇన్ స్టాగ్రామ్(instagram)లోకి అడుగుపెట్టిన తర్వాత.. అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్.. అంటే 90 లక్షల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న హీరోగా నిలిచాడు చరణ్. దీనంతటికి కారణం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనే చెప్పొచ్చు. ఈ సినిమాతో ఇండియా వైడ్‌గానే కాకుండా.. హాలీవుడ్ స్థాయిలో తన నటనతో ఇంప్రెస్ చేశాడు చరణ్. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు.