జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్(Srinagar)లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ (Tollywood) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల దేశంలోని పలు ప్రతిష్టాత్మకమైన సదస్సుల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి పాల్గొంటూ అరుదైన గౌరవాలను దక్కించుకుంటున్నాడు. తాజాగా కశ్మీర్ – శ్రీనగర్ (Srinagar) లో జరుగుతున్న G20 సదస్సు 2023 లో చరణ్ పాల్గొన్నాడు. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం (Film tourism) ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఇక మన దేశం తరుపు నుంచి రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ(RRR movie)లోని ఈ చిత్రానికి ఈ ఏడాది ఉత్తమ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సదస్సులో రామ్ చరణ్ (Ram Charan) కాశ్మీర్ అండ్ శ్రీనగర్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపాడు.కాశ్మీర్ ఒక స్వర్గం లాంటి ప్రదేశం. 1986 నుంచి నా సమ్మర్ వెకేషన్స్ అని, మా నాన్నతో అని ఇక్కడికి వస్తూనే ఉన్నాను. మా నాన్న (Chiranjeevi) కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఆయన మూవీలు ఎన్నో ఇక్కడ గుల్మార్గ్(Gulmarg), సోనామర్గ్ లో చిత్రీకరణ జరుపుకున్నాయి. అంతెందుకు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతున్న ఈ ఆడిటోరియంలో నేను 2016లో షూటింగ్ జరుపుకున్నాను. నా మూవీ ధృవ కోసం ఇక్కడ 95 రోజులు వర్క్ చేశాం. ఆ సినిమా ద్వారా మా ఆడియన్స్ కి కాశ్మీర్ ని మేము కొంత చూపించగలిగాం” అని రాంచరణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy), జితేంద్ర సింగ్ పాల్గోన్నారు.