కేరళ (Kerala) రాష్ట్రంలో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ అన్న సొంత చెల్లెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బలవంతం చేసి తన కోరిక తీర్చుకున్నాడు కీచుడు. దీంతో ఆ మైనర్ బాలిక (Girl) గర్భం దాల్చింది. విషయం తల్లిదండ్రుల కు తెలపడంతో వారు షాక్ అయ్యారు. అప్పటికే ఆమె 7 నెలల గర్భిణీ (Pregnant). దీంతో ఆ తల్లిదండ్రులు అబార్షన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మైనర్ బాలిక అబార్షన్ (Abortion) కేసును జస్టిస్ జియాద్ రహ్మాణ్ తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ డాక్టర్లు సమర్పించిన మెడికల్ రిపోర్టు(Medical report)ను పరిశీలించిన జడ్జి.. అబార్షన్ కు అనుమతినిస్తూ తీర్పు వెలువరించారు. ‘‘బాలిక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని మెడికల్ బోర్డు తెలిపింది. కానీ నేను మాత్రం అబార్షన్ వైపే మొగ్గు చూపుతా’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.మైనర్ బాలిక (15ఏళ్లు) పూర్తి ఆరోగ్యంగా ఉందని, అబార్షన్ వల్ల ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు (Doctors) ఇచ్చిన రిపోర్టు ఆధారంగా అబార్షన్ కు అనుమతినిస్తూ జడ్జి (judge) ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ బిడ్డను కంటే భవిష్యత్తులో ఆ బాలికకు సామాజికంగా, ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయని జడ్జి అభిప్రాయపడ్డారు.
సొంత అన్నకు బిడ్డను కన్నది అంటూ ఈ సమాజం ఆమెను అనేక రకాలుగా అవమానాలకు గురి చేసే అవకాశం ఉందని, అది ఆమెకు చాలా ప్రమాదమని న్యాయమూర్తి తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలికకు వెంటనే అబార్షన్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని మలప్పురం (Malappuram) వైద్యాధికారి, మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి సూపరిండెంట్ కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా అత్యాచారానికి పాల్పడ్డ ఆ బాలిక సోదరుడు (మైనర్)ను జువైనల్ హోం(Juvenile Home)కు తరలించినట్లు సమాచారం.