»Unknown Persons Attacked On Ap Brs Party New Offfice In Gutur
Vandalise ప్రారంభించిన రోజే.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించి.. ఏపీలో కూడా తెలంగాణలో మాదిరి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. కార్యాలయం అనంతరం అందరూ వెళ్లిపోయారు.
ప్రారంభమైన రోజే (Inaguration Day) పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు (Flexi), బ్యానర్లు (Banners) చింపేశారు. కార్యాలయంపై దాడి చేసి కొందరు దుండగులు బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన ఏపీలో జరగ్గా.. దాడి జరిగింది భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కార్యాలయంపై. ఈ దాడిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో (Telangana) అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఏపీలో కార్యాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం గుంటూరులోని (Guntur) మంగళగిరి రోడ్డులో ఉన్న ఐదంతస్తుల భవనంలో పార్టీ కార్యాలయం (Party Office) ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు (Thota Chandrasekhar) ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ (KCR)పై ప్రశంసలు కురిపించి.. ఏపీలో కూడా తెలంగాణలో మాదిరి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. కార్యాలయం అనంతరం అందరూ వెళ్లిపోయారు. కాగా ఆదివారం రాత్రి మాత్రం పార్టీ కార్యాలయంపై కొందరు దాడికి పాల్పడ్డారు.
ఫ్లెక్సీ బోర్డులను ధ్వంసం చేయగా.. బీఆర్ఎస్ పార్టీ జెండాలను తొలగించారు. బ్యానర్లు చింపేశారు. తెల్లవారుజామున పార్టీ నాయకులు వచ్చి చూడగా పరిస్థితి బీభత్సంగా మారింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు (Police) కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ దాడిని గులాబీ పార్టీ నాయకులు ఖండించారు. ఏపీలో పార్టీకి ఆదరణ (Following) లభిస్తుండడంతో జీర్ణించుకోలేక ప్రత్యర్థి పార్టీలు (Opposition) ఈ దాడికి పాల్పడ్డాయని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. త్వరలోనే పార్టీని విస్తరిస్తామని.. ప్రజల మధ్యకు వెళ్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. తమను ఏపీ నుంచి వేరు చేయలేరని స్పష్టం చేశారు.