మేజర్ ఉన్నికృష్ణన్ (Unnikrishnan) అరుదైన గౌవరం దక్కింది. ఇండియన్ రైల్వే (Indian Railways) ఘన నివాళి అర్పించింది. టీకేడీ డబ్ల్యూడీ 4బీ 40049 ట్త్రెన్ కు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. అశోక చక్ర (Ashoka Chakra) అని నామకరణం చేసింది.26/11 న సముద్ర మార్గం ద్వారా ముంబై (Mumbai) లోకి చొరబడ్డ పాకిస్తాన్ ఐఎస్ఐ (ISI)ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అందరికీ తెలిసిందే. ముంబై తాజ్ హోటల్ (Taj Hotel) లోకి చొరబడ్డ ఉగ్రవాదులు అందులో ఉన్నవారిని నిర్భంధించి రక్తపాతానికి ఒడిగట్టారు. ఆ సమయంలో 51 ఎస్ఏజీ, ఎన్ఎస్జీ బీహార్ రెజిమెంట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన బృందంతో కలిసి హోటల్ లోపలికి వెళ్లారు. తనతో పాటు వచ్చిన ఒక్కొక్కరు ఉగ్రవాదుల తూటాలకు బలైపోయిన ఏ మాత్రం వెరవకుండా ఒంటరిగా పోరాటం జరిపారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న పలువురిని విడిపించారు. ఈ క్రమంలో తన ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం (Government of India) అశోక చక్ర బిరుదునిచ్చి సన్మానించింది. మేజర్ సందీప్ పై తీసిన బయోపిక్ (Biopic) ని మహేష్ బాబు నిర్మించగా అడవి శేష్ అతని పాత్రని పోషించాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.