Minister Puvvada : ఖమ్మంలో పొంగులేటి ఓ బచ్చా పువ్వాడ ఫైర్
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక బచ్చా అని మంత్రి పువ్వాడ (Minister Puvvada) అజయ్ విమర్శించారు. బీఆర్ఎస్లో (BRS) ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసిన చరిత్ర ఆయనదని మంత్రి ఆరోపించారు. తనను తాను అతిగా ఊహించుకుంటున్నాడని, ఆయనకు ఓ సిద్ధాంతం, విలువ లేవని విమర్శించారు. ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నాడని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో (Khammam) పువ్వాడ అజయ్ ఓటమి ఖాయమని పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి.. ఇవాళ ఎలాంటి స్థితిలో ఉన్నాడని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పారు. కాంట్రాక్టర్‌గా పనులు చేయకుండానే వందల కోట్లు బొక్కావని ఆరోపించారు.
ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక ఫ్రస్టేషన్లో ఉన్నారని, అందుకే బీఆర్ఎస్ (BRS) ను విమర్శిస్తున్నారని వెల్లడించారు. ఖమ్మం (Khammam)జిల్లాలో తమ కుటుంబానికి ఘన చరిత్ర ఉందని, 60 ఏళ్లుగా తాము నికార్సయిన రాజకీయాలు చేస్తున్నామని పువ్వాడ చెప్పుకొచ్చారు. తాను తండ్రికి తగ్గ వారసుడ్ని అని ఉద్ఘాటించారు. పొంగులేటి (Ponguleti) పక్కన ఉండేవాళ్లందరూ గూండాలు, గంజాయి అమ్మేవాళ్లు అని ఆరోపించారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరుతున్నాడని వ్యాఖ్యానించారు.ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని, బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలని ప్రజలు డిసైడ్ అయ్యారని, దాంతో బీఆర్ఎస్ నేతలకు నిద్ర కరవైందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా సంగతి తెలిసిందే. అప్పుడే ఏమైంది… ముందుంది ముసళ్ల పండుగ అని అన్నారు. కుట్రలు కుతంత్రాలు చేసి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఓటర్లు మాత్రం సీఎం కేసీఆర్ (CMKCR) తో పాటు మిమ్మల్ని ఇంటికి పంపబోతున్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు.