»My Salute To Jagan Perni Nani Comments Krishna District Ap
Perni nani: జగన్ కు నా పాదాభివందనం
మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తనకు మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో తెలియదని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani)కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో బందర్ పోర్టును సీఎం జగన్ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా పేర్కొన్నారు.
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) సంచలన ప్రకటన చేశాడు. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు పనులను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన క్రమంలో వెల్లడించారు. కృష్ణాజిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో సభా వేదిక పై నుంచి తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. అయితే మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడే అవకాశం వస్తుందో రాదోనని అన్నారు.
జగన్(jagan) వయసులో చిన్నవాడు అయిపోయాడని..లేదంటే పాదాభివందనం చేసి ఉండేవాడినని అన్నారు. అంతేకాదు తాను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకొస్తున్న సీఎం జగన్ కు చేతులు ఎత్తి దండం పెడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పోర్ట్ కోసం ఎదురు చూస్తోన్నామని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఆ కల సాకారమౌతోందని వెల్లడించారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) ఓడరేవుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఆ బాధ్యతలను స్వీకరించారని నానీ స్పష్టం చేశారు. ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు ముఖ్యమంత్రి జగన్ఏదో ఒక వర్గానికి సంక్షేమం అందిస్తూనే ఉంటారని వివరించారు.
పోర్టు నిర్మాణానికి రాక్షసుడిలా చంద్రబాబు(chandrababu) అడ్డుపడ్డాడని..ఆ పీటముడులు తీయటానికి నాలుగేళ్లు పట్టిందని వెల్లడించారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నామినేషన్ వేసే వారం రోజుల ముందు పోర్టుకు శంకుస్థాపన చేశాడని పేర్ని నానీ విమర్శించారు.