»Drinking Beer In The Summer Beware Of Danger In Health Problems
Drinking beer: సమ్మర్ లో బీరు తాగుతున్నారా? డేంజర్ జాగ్రత్త!
ఎండలు(summer time) ఎక్కువగా ఉన్నాయని రోజూ చల్లటి బీర్(Drinking beer) స్వీకరించాలని చాలా మంది భావిస్తారు. అంతేకాదు యూత్ అయితే విచ్చలవిడిగా తాగేస్తారు కూడా. అయితే అలా తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చుద్దాం.
సమ్మర్ వేడిని(summer time) తట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానిలో చాలా మంది బీరు తాగడానికి (Drinking beer) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బీరులో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్య రాదని అందరూ అనుకుంటారు. కానీ బీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటో ఓసారి తెలుసుకుందాం.
బీర్ లో 5 శాతం ఆల్కాహాల్ ఉంటుంది. 100 ఎమ్ ఎల్ బీర్ లో 35 నుంచి 40 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఒక బీర్ బాటిల్ తాగితే 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బీర్ బాటిళ్లు తాగుతూ ఉంటారు. దీంతో అధిక క్యాలరీలు శరీరంలోకి చేరుతాయి. అలాగే బీర్(beer) తాగుతూ రకరకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. దీంతో మరిన్ని క్యాలరీలు శరీరంలోకి చేరుతాయి. అలాగే బీర్ ను తాగడం వల్ల మనం అధికంగా మినరల్స్ ను కోల్పోవాల్సి వస్తుంది.
శరీరంలోకి ప్రవేశించిన బీర్ ను బయటకు పంపించడానికి యూరిన్(urine) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా ఎక్కువగా ఉత్పత్తి అయిన యూరిన్ లో ఉండే విటమిన్స్, మినరల్స్ ను మూత్రపిండాలు తిరిగి గ్రహించుకుంటాయి. కానీ బీర్ తాగడం వల్ల విటమిన్స్, మినరల్స్ ను మూత్రపిండాలు గ్రహించుకునే శక్తి తగ్గుతుంది. దీంతో విటమిన్స్, మినరల్స్ మూత్రం ద్వారా ఎక్కువగా బయటకు పోతాయి. మినరల్స్, విటమిన్స్ కోల్పోవడం వల్ల రక్తంలో క్షారత్వం తగ్గుతుంది.
దీంతో ఎముకల్లో ఉండే క్యాల్షియం రక్తంలో కలిసి రక్తం(blood)లో క్షారత్వం తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. దీని కారణంగా ఎముకలు గుళ్ల బారుతాయి. బీర్ తాగడం వల్ల బరువు పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. బీర్ వంటి ఆల్కాహాల్ కలిపిన పానీయాలను తాగడం వల్ల శరీరానికి నష్టం కలగడంతో పాటు శరీరానికి లాభం కలిగించే ప్రక్రియ కూడా ఆగిపోతుంది.
బీర్ తాగడం వల్ల కాలేయంలో వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియ ఆగిపోతుంది. బీర్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, ఊబకాయం, బాణ పొట్ట వంటవి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.