Oily Food : ఆయిల్ ఫుడ్ ఇష్టమా? తిన్నాక ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పకోడీలు, బజ్జీలు, ఆలూ ఫింగర్స్ లాంటి ఆయిలీ ఫుడ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరి అవి తిన్నతర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోమని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
What to Do After Eating Oily Food : చాలా మందికి డీప్ ఫ్రై చేసిన ఆయిలీ ఫుడ్స్(OILY FOOD) అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. పూరీ, వడ.. లాంటి వాటిని ఇష్టంగా తినేస్తుంటారు. ఇలా కాక నూనెల్లో చేసిన పదార్థాలను అధికంగా తినడం వల్ల మన శరీరంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. దీని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు( HEALTH PROBLEMS) అన్నీ ఇన్నీ కావు. అందుకనే సాధ్యమైనంత వరకు నూనెల్లో వేపించి తీసిన వాటిని తక్కువగా తినే ప్రయత్నం చేయాలి.
ఒక వేళ నూనెల్లో వేపించిన పదార్థాలను తిన్నారనుకుందాం. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటి వల్ల వచ్చే చెడు ప్రభావాలను కొంత వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ పుడ్(OIL FOOD) తిన్నాక ఊరికే అలా కూర్చుని ఉండకూడదు. వాకింగ్ చేయడం, ఏమైనా పనులు చేసుకోవడం లాంటివి చేయడం వల్ల ఆ కొవ్వులు అదనంగా శరీరంలో పేరుకుపోకుండా ఉంటాయి.
అలాగే ఎక్కువగా నూనెల్లోని వంటకాల్ని తిన్నప్పుడు గ్రీన్ టీ తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. లేదంటే గోరు వెచ్చటి నీటిని తాగడం వల్లా ఉపయోగమే. అలాగే గోరు వెచ్చటి నీటిలో ఓ స్పూను వాము వేసుకుని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. అలాగే ఆ తర్వాత మీల్ తినేప్పుడు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆయిలీ ఫుడ్స్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు మన ఆరోగ్యంపై కొంత వరకు తగ్గుతాయి.