»All Wrestlers Ready For Narco Tests Vinesh Phogat
Vinesh Phogat : రెజ్లర్లంతా నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు : వినేశ్ ఫొగాట్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు (WFI), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) నార్కో అనాలసిస్ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తనతోపాటు మరో ఇద్దరికి కూడా నార్కో పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ రోడెక్కిన స్టార్ రెజ్లర వివాదం మరింత ముదిరింది. నార్కో అనాలసిస్ పరీక్షలకు (narco test) తాము సిద్ధమని టాప్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat )ప్రకటించారు. తాను ఒక్కటే కాదని.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి (Wrestling Federation of India chief)పై ఫిర్యాదు చేసిన వారంతా నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘అతను (బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్) మా ఇద్దరి పేర్ల (వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా)ను మాత్రమే ప్రస్తావించారు. మేమిద్దరమే కాదు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)పై ఫిర్యాదు చేసిన వారంతా ప్రత్యక్ష నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు’ అని వినేశ్ వెల్లడించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు (Wrestlers) ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.
గత నెల రోజులుగా వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్(Sakṣi malik)లతోపాటు మరికొంత మంది మహిళా రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా బజరంగ్ పునియా వంటి ఒలింపిక్ పతక విజేతలు సైతం పాల్గొంటున్నారు. మల్లయోధుల ఆందోళనకు రైతు సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి.దీనిపై స్పందించిన బ్రిజ్ భూషణ్ నార్కో అనాలసిస్ పరీక్షలకు తాను సిద్ధమని.. అయితే తనతోపాటు వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia)కు సైతం నార్కో పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు.
బ్రిజ్ భూషణ్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలోనే రెజ్లర్స్ రోడెక్కారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర.. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్(Mary Kom) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేసేందుకు ఆదేశించింది.అయితే ఆ పర్యవేక్షక కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసి.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఆ నివేదికను కేంద్రం బయటపెట్టలేదు. అలాగే బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెజ్లరు ఇప్పుడు మరోసారి ధర్నా చేయడం ప్రారంభించారు. దిల్లీ (Delhi) లోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం నుంచి దీక్ష చేస్తూ రోడ్డుపైనే కూర్చున్నారు. మరోవైపు బ్రిజ్ భూషణ్‌పై ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు ఇటీవల పోలీసు స్టేషన్లో కంప్లైంట్ (Compliant) చేశారు. కానీ, ఇంతవరకూ పోలీసులు ఆయనపై కేసు చేయకపోవడంతో రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.