»Health Director Gadala Srinivasa Rao Sensational Comments On Mla Vanama Venkateswara Rao
GSR Trust ఎమ్మెల్యేపై తిరగబడ్డ డాక్టర్ గడల శ్రీనివాస్.. ఇక దిగిపో అంటూ ఆల్టిమేటం
నయుడు ఇంకెన్ని రోజులు ప్రజలను బెదిరిస్తారు? వారి ఆగడాలకు చెక్ పెట్టే రోగులు దగ్గరపడ్డాయి. గత ఎన్నికలే చివరివి ప్లీజ్ ఒక్కసారి ఓటేసి గెలిపించండి అంటూ ఎమ్మెల్యే వనమా మాటలు అందరికీ గుర్తున్నాయి. కానీ ఈసారి కూడా తానే పోటీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది..
ఆయనో వైద్యుడు (Doctor).. అంతే రాష్ట్ర వైద్య విభాగానికి అధిపతి. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకోగా.. ఎన్నికలు రావడంతో మరింత దూకుడు పెంచారు. ఇప్పుడు ఏకంగా తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే (MLA) తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఒక ప్రభుత్వ అధికారి ఫక్తూ రాజకీయ (Political) ప్రసంగం చేయడం సంచలనగా మారింది. ఎమ్మెల్యేను రిటైర్మెంట్ తీసుకో అని సూచించారు. అంతేకాకుండా ఆ నాయకుడిపై తీవ్ర విమర్శలు చేసి రాజకీయ వేడి రగిల్చారు.
తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (Telangana Health Director) డాక్టర్ గడల శ్రీనివాస రావు (Dr Gadala Srinivasa Rao). ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri Kothagudem) తరచూ పర్యటిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే జీఎస్ఆర్ ట్రస్ట్ (GSR Trust) పేరిట శ్రీనివాస రావు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వారాంతాల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉల్వనూర్ (Ulvanooru) గ్రామంలో తన ట్రస్ట్ తరఫున నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన చేసిన ప్రసంగం కొత్తగూడెంలో కలకలం రేపింది. ముఖ్యంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు (Vanama Venkateswara Rao) లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
‘తనయుడు ఇంకెన్ని రోజులు ప్రజలను బెదిరిస్తారు? వారి ఆగడాలకు చెక్ పెట్టే రోగులు దగ్గరపడ్డాయి. గత ఎన్నికలే (Elections) చివరివి ప్లీజ్ ఒక్కసారి ఓటేసి గెలిపించండి అంటూ ఎమ్మెల్యే వనమా మాటలు అందరికీ గుర్తున్నాయి. కానీ ఈసారి కూడా తానే పోటీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది.. ఎంకెంత కాలం వృద్ధాప్యంలో (Oldage) పెద్దవారిని కష్టపెట్టడం?’ అని గడల శ్రీనివాస రావు నిలదీశారు.
‘మీకు 80 ఏళ్లు వచ్చాయి. వయసైపోయింది. నియోజకవర్గానికి చాలా చేశారు. ఇక విశ్రాంతి తీసుకోండి. మరో నాలుగు నెలలు ఓపిక పట్టండి.. అన్ని సెట్ అవుతాయి. గడల కార్యక్రమానికి వెళ్తే పదవులు పీకేస్తారా? దళిత బంధు (Dalit Bandhu Scheme)రాకుండా అడ్డుకుంటారా? అది చేస్తా ఇది చేస్తా అనే బెదిరింపులు ఇంకెన్నాళ్లు సాగవు’ అని హెచ్చరించారు. కొత్తగూడెంను కొత్తగా చూద్దామని పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని ఆటంకాలు సృష్టించినా నా ట్రస్ట్ ద్వారా ప్రజా సేవ కార్యక్రమాలు ఆగవు.. నా జీవితం ప్రజాసేవకు అంకితం అని శ్రీనివాస రావు స్పష్టం చేశారు.