No Evidence Found In Minors Harassment Claims Against WFI Chief
Brij Bhushan: లైంగిక వైధింపుల అంశంపై భారత రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఓ మైనర్‌ను లైంగిక వేధించారని అంటున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. దీంతో పోస్కో సెక్షన్ నుంచి బ్రిజ్ భూషణ్ తప్పించుకున్నట్టు అయ్యింది. మిగతా ఆరోపణలకు సంబంధించి విచారణ మాత్రం జరుగుతుంది.
లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు వెయ్యి పేజీలో ఛార్జిషీట్ రూపొందించారు. అందులో 500 పేజీల నివేదిక పొందుపరచగా.. ఆ కేసు రద్దు చేయాలని పోలీసులు సూచించారు. మైనర్ లైంగిక వేధింపులకు సంబంధించి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. చార్జిషీట్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు సమర్పించారు. ఆ సమయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాజిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ కూడా అక్కడే ఉన్నారు.
మైనర్ అథ్లెట్ బ్రిజ్ భూషణ్‌పై (Brij Bhushan) ఏప్రిల్ నెలలో పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసింది. తర్వాత ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారని తెలిసింది. తనను ఎంపిక చేయకపోవడంతో కోపంతో అలా కేసు ఫైల్ చేశానని వివరించింది. టోర్నీల కోసం చాలా వర్క్ చేశానని.. సెలక్ట్ చేయలేదని.. దాంతో డ్రిపెషన్లోకి వెళ్లానని పేర్కొంది. దాంతో బ్రిజ్ భూషణ్‌పై (Brij Bhushan) లైంగిక వేధింపుల కేసు నమోదు చేశానని వివరించింది. తర్వాత కేసు విత్ డ్రా చేసుకుంది. మైనర్ కేసుకు సంబంధించి పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 173 కింద రిపోర్ట్ రూపొందించారు. మైనర్‌తోపాటు తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసు విచారణ జూలై 4వ తేదీన జరగనుంది.