Karnisena: కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్దేవ్ దారుణ హత్య
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లోని ఆయన నివాసంపై కాల్పులు జరిగాయి. సోఫాలో కూర్చున్న సుఖ్ దేవ్ సింగ్ పై ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Karnisena: గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లోని ఆయన నివాసంపై కాల్పులు జరిగాయి. సోఫాలో కూర్చున్న సుఖ్ దేవ్ సింగ్ పై ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతలో సుఖ్దేవ్ కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. సుఖ్దేవ్ ఇద్దరు అనుచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుఖ్దేవ్ నివాసం విషాదంతో నిండిపోయింది. సుఖ్దేవ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముష్కరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
జైపూర్లోని శ్యామ్ నగర్ ప్రాంతంలోని ఆయన ఇంటి దగ్గర కొంతకాలం క్రితం దాడి జరిగింది. సుఖ్ దేవ్ సింగ్ మద్దతుదారులు, ఇతరులు ఆసుపత్రికి వస్తున్నారు. అయితే ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. పోలీసులు నగరమంతటా హై అలర్ట్ ప్రకటించారు. పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై దాడికి దిగిన సుఖ్ దేవ్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వినిపించింది. రాజ్పుత్ మహిళ పద్మావతిపై సినిమాలో అనుచితమైన సన్నివేశాలు ఉన్నాయని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆపాలని బన్సాలీపై దాడి జరిగింది. హిందుత్వ, రాజ్పుత్ ఎజెండాతో సుఖ్దేవ్ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు.