»Surg 32 The Countrys First Modular Electric Auto And Scooter
Surg 32: దేశంలో మొట్టమొదటి మాడ్యులర్ ఎలక్ట్రిక్ ఆటో అండ్ స్కూటర్
ఇటీవల జైపూర్‌లో హీరో వరల్డ్ 2024 ఈవెంట్ జరిగింది. ఇందులో హీరో మోటోకార్ప్ సర్జ్ S32 పేరుతో ఓ వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది కార్గో లేదా ప్రయాణికులను రవాణా చేయడానికి 3-వీలర్‌తో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కలిపే మాడ్యులర్ వాహనం.
Surg 32: ఇటీవల జైపూర్‌లో హీరో వరల్డ్ 2024 ఈవెంట్ జరిగింది. ఇందులో హీరో మోటోకార్ప్ సర్జ్ S32 పేరుతో ఓ వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది కార్గో లేదా ప్రయాణికులను రవాణా చేయడానికి త్రీవీలర్తో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కలిపే మాడ్యులర్ వాహనం. స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెన తెలిపింది. ఇదో టూ-ఇన్-వన్ ఎలక్ట్రిక్ వెహికల్. మన అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మార్చుకోవచ్చు. వ్యాపార అవసరాల కోసం త్రీవీలర్‌గా, వ్యక్తిగత అవసరాల కోసం టూవీలర్గా కేవలం మూడు నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.
సాధారణ ఆటో రిక్షాల మాదిరిగా ఈ త్రీ వీలర్ ఆటో రిక్షాలోనూ విండ్ స్క్రీన్, హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి. ఆటోకు డోర్లు లేనప్పటికీ జిప్‌తో కూడా సాఫ్ట్డోర్లను అందించే అవకాశం ఉంది. ఇక కొత్త తరహా వాహనంలో త్రీవీలర్, టూవీలర్‌కు వేర్వేరు సామర్థ్యాలు నిర్ణయించారు. త్రీవీలర్‌లో 10kW ఇంజిన్ ఇచ్చారు. 11kWh బ్యాటరీని ఇచ్చారు. ఇక స్కూటర్లో 3kW ఇంజిన్ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా 3.5 kWh బ్యాటరీని అమర్చారు. త్రీవీలర్ టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. 500 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. టూవీలర్ గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.