»Karnisena Sukhadev Murder Case Three Accused Arrested
Karnisena: సుఖదేవ్ హత్యకేసు..ముగ్గురు అరెస్ట్
జైపూర్‌లో గల శ్యామ్నగర్లో ఉన్న రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీని గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణ హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Karnisena: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ రాజస్థాన్‌లో పట్టపగలే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇతని హత్య కేసులో తాజాగా ఇద్దరు షూటర్లు రోహిత్ రాఠోడ్, నితిన్ ఫౌజీలను చంఢీగడ్‌లో అరెస్టు చేశారు. నిందితులతో పాటు వారి సహచరుడు ఉద్ధమ్ సింగ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులతో పాటు రాజస్థాన్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. నిందితుల సమాచారం అందించిన వాళ్లకి రూ.5లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఈక్రమంలో వాళ్లు వినియోగిస్తున్న మొబైల్ ద్వారా పోలీసులు వాళ్ల లోకేషన్‌ను గుర్తించి అక్కడి చేరుకుని అరెస్ట్ చేశారు.
జైపూర్‌లో గల శ్యామ్నగర్లో ఉన్న నివాసంలో సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు గురయ్యారు. గోగామేడీతో మాట్లాడాలని భద్రతా సిబ్బందికి చెప్పి ఇంటి లోపలికి వెళ్లారు. కొంత సమయం మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కాల్చి చంపారు. ముగ్గురు వ్యక్తులు ఆయనను కాల్చి చంపగా.. అందులో ఒకడైన నవీన్ షెకావత్‌ను సుఖ్‌దేవ్ సింగ్ సహచరులు కాల్చి చంపారు. ఈ ఘటనలో గోగామేడీ అనుచరుడు ఒకరు చనిపోగా.. ఇద్దరికీ గాయాలు అయ్యాయి. సుఖదేవ్ హత్య తమే చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకకు అనుబంధంగా పనిచేసే రోహిత్ గోదారా గ్యాంగ్ ప్రకటించుకుంది.