»47 Years Woman Who Changed Gender And Married A Transgender Bhopal Madhya Pradesh
Woman: లింగమార్పిడి చేసుకుని ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్న యువతి
ఓ మహిళ 47 ఏళ్ల వయసులో ట్రాన్స్ జెండర్ గా మారిపోయింది. అంతేకాదు మరో ట్రాన్స్ జెండర్ వ్యక్తితో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఎందుకు అలా చేసింది? ఆ విశేషాలేంటీ అనేది ఇప్పుడు చుద్దాం.
47 years woman who changed gender and married a transgender bhopal madhya pradesh
ప్రేమకు కారణాలుండవు, హద్దులు కూడా లేవనే చెప్పవచ్చు. ఇది ఎప్పుడు, ఎందుకు ఎవరిపై కలుగుతుందో చెప్పలేం. అయితే ఇటివల ఓ మహిళ ట్రాన్స్ జెండర్ గా మారిపోయి మరో ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకుంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి తన చిరకాల స్నేహితుడిని ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్ధంగా వివాహం చేసుకుంది. దీంతో జీవితకాలం వారిద్దరు భాగస్వాములు అయ్యారు. అస్తిత్వ సోని పూర్వం ఆమెను అల్కా అని పిలిచేవారు. అయితే ఆమెకు మగ లక్షణాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పురుషుడిగా మారిపోయింది. ఆ తర్వాత అస్తిత్వ అనే పేరును కూడా మార్చుకుంది.
అల్కా సోనిగా జన్మించిన అస్తిత్వ కొన్నాళ్ల తర్వాత తాను స్త్రీని కాదని గ్రహించి తన జీవితాన్ని పురుషుడిగా జీవించడం ప్రారంభించింది. తన 47వ పుట్టినరోజున అస్తిత్వ ధైర్యాన్ని కూడగట్టుకుని లింగ పరివర్తన శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుని పేరు మార్చుకుంది. ఆ క్రమంలోనే తనకు ఆస్తా అనే ట్రాన్స్ జెండర్ పరిచయం అయ్యాడు. క్రమంగా వారి సంభాషణ కాస్తా ప్రేమగా మారిపోయింది. చివరకు వారిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన వ్యక్తిగత చట్టాలతో సహా ఇప్పటికే ఉన్న చట్టాలను అనుసరించి నేరుగా సంబంధాలలో ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు వివాహం చేసుకోవచ్చని అక్టోబర్‌లో సుప్రీంకోర్టు నిర్ణయించినందున ఈ ప్రత్యేక వివాహం జరిగింది.