సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఎల్లుండి రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Revanth Reddy: టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా ఎన్నుకుంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ (Revanth) కష్టపడ్డారు. అందుకే ఆయనకు పదవీ వరించింది. సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియను డీకే శివకుమార్, ఠాక్రే చేపట్టారని.. ఈ రోజు అధ్యక్షుడు ఖర్గే నివాసంలో చర్చలు జరిపామని తెలిపారు.
అందరి అభిప్రాయంతో రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామని కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. ఎల్లుండి (గురువారం) సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. క్యాబినెట్లో సీనియర్లకు చోటు ఉంటుందని తేల్చిచెప్పారు. సమిష్టి ప్రభుత్వం ఏర్పడనుందని పేర్కొన్నారు.
ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకి విజయాన్ని అందించడంతో థాంక్స్ తెలిపారు. అలాగే ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీపీపీ చైర్మన్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అగ్రనేత ప్రియాంక గాంధీ ధన్యవాదాలు తెలిపారు. అందరి అభిప్రాయంతో రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. అంతకుముందే రేవంత్ రెడ్డికి హైకమాండ్ పిలుపు వచ్చింది. ఢిల్లీ రావాలని కోరడంతో హుటహుటిన హస్తిన బయల్దేరారు.