గతంలో ఆమెతో ప్రేమాయణం సాగించిన మనిషి.. వేరొకరితో దగ్గరవ్వడాన్ని తట్టుకోలేక వీడియోలతో భయపెట్టా.. నిజానికి ఇది తనను తిరిగి నా దగ్గరకు తీసుకోవాలనుకున్న... ప్రేమగా ఉండాలనుకున్నా... కానీ అది ఈ పరిస్థితికి తీసుకొచ్చింది.
pushpa actor jagadeesh arrested by panjagutta police
‘Pushpa ’Jagadeesh: గతంలో ఆమెతో ప్రేమాయణం సాగించిన మనిషి.. వేరొకరితో దగ్గరవ్వడాన్ని తట్టుకోలేక వీడియోలతో భయపెట్టా.. నిజానికి ఇది తనను తిరిగి నా దగ్గరకు తీసుకోవాలనుకున్న… ప్రేమగా ఉండాలనుకున్నా… కానీ అది ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. పోలీసుల విచారణలో పుష్ప సినిమా ఫేమ్ జగదీష్ ఇచ్చిన వాంగ్మూలం ఇది. యువతి ఆత్మహత్య కేసులో పుష్ప జగదీష్ అలియాస్ బండారు ప్రతాప్ నేరం అంగీకరించాడు. కోర్టు అనుమతితో పంజాగుట్ట పోలీసులు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన జగదీష్ కు ఐదేళ్ల క్రితం ఈ యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అయితే, జగదీష్ పుష్ప చిత్రంతో పేరు తెచ్చుకున్న తర్వాత తన ప్రవర్తనను మార్చుకున్నాడు. యువతికి దూరంగా ఉండడం ప్రారంభించింది. నిజానికి, అతను కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దూరంగా వెళ్ళాడు. దీంతో ఆ యువతికి మరో వ్యక్తితో సంబంధం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న జగదీష్… ఆమెను మళ్లీ దారిలోకి తీసుకురావాలనుకున్నాడు. గతనెల 27న పంజాగుట్టలోని యువతి ఇంటికెళ్లిన జగదీష్.. తాను మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసి ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో తీవ్ర ఒత్తిడికి గురైన సదరు యువతి.. గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో మొదట ఆత్మహత్య కేసు కింద నమోదు చేశారు పోలీసులు. అయితే తన తండ్రి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈ కేసు నమోదు చేయాల్సి వచ్చింది.