ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తమామలు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇద్దరు తోడికోడళ్లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Suicide: ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తమామలు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇద్దరు తోడికోడళ్లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్న కోడలు పాలపాటి స్వాతి మృతదేహం లభ్యం కాగా, పెద్ద కోడలు రూపాదేవి మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదు. నదిలో ఆమె కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అత్తమామలు తన కూతురిని ఎంతగానో క్షోభ పెట్టినట్లు మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కుమార్తెను అత్తమామలు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మృతురాలి అత్తమామల ఇంటిని బంధువులు ధ్వంసం చేశారు. అంతే కాకుండా వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్తమామలు, భర్తలపై కేసు నమోదు చేశారు.