ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రెండు రోజుల వారణాసి పర్యటనలో ఉన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్ షో సందర్భంగా అంబులెన్స్‌కు మార్గం కల్పించడానికి తన కాన్వాయ్‌ను ఆపారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రెండు రోజుల వారణాసి పర్యటనలో ఉన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్ షో సందర్భంగా అంబులెన్స్‌కు మార్గం కల్పించడానికి తన కాన్వాయ్‌ను ఆపారు. ఈ పర్యటనలో వారణాసి, పూర్వాంచల్ కోసం 19,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 37 ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా, నమో ఘాట్ నుండి కాశీ తమిళ సంగమం 2.0ని కూడా మోడీ ప్రారంభిస్తారు. దీంతో పాటు కన్యాకుమారి నుంచి వారణాసి వరకు కొత్త రైలుకు ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు.
ప్రధాని మోడీ తన రోడ్ షోలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్లో కూడా ప్రధాని మోడీ కాన్వాయ్‌లో అంబులెన్స్ వచ్చింది. దానికి కూడా మార్గం ఇచ్చారు. డిసెంబర్ 1, 2022న, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని మోడీ దాదాపు 30 కి.మీ మెగా రోడ్ షో చేస్తున్నారు. ఈ సమయంలో అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు కాన్వాయ్‌ను పక్కన పెట్టారు. అదేవిధంగా, గత ఏడాది సెప్టెంబర్ 30న, ప్రధాని మోడీ అహ్మదాబాద్ నుండి గాంధీనగర్‌కు వెళుతున్నప్పుడు, కాన్వాయ్‌లో ఇరుక్కున్న అంబులెన్స్‌కు మార్గం కల్పించడానికి ఆయన తన కాన్వాయ్‌ను ఆపారు.
వారణాసి పర్యటనలో భాగంగా తొలిరోజు సాయంత్రం నమో ఘాట్ నుంచి కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుండి వారణాసికి వెళ్లే కాశీ తమిళ సంగం ఎక్స్‌ప్రెస్‌ను ఇక్కడి నుంచి ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు నుండి డిసెంబర్ 31 వరకు కాశీ తమిళ సంగమం రెండవ ఎడిషన్ సందర్భంగా తమిళనాడు – పుదుచ్చేరి నుండి సుమారు 1,400 మంది వారణాసితో పాటు ప్రయాగ్‌రాజ్ మరియు అయోధ్యకు వెళతారు.