Fire Accident: ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ముఖర్జీ నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్లో ఫైర్ యాక్సిడెంగ్ (Fire Accident) జరగగా.. విద్యార్థులు (students) భయపడ్డారు. బయటకు వచ్చేందుకు కిటికీల నుంచి దిగారు. తీగలు పట్టుకొని మరీ కిందకు దిగగా.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోచింగ్ సెంటర్ వద్ద మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాదం జరిగింది.
ఫైర్ యాక్సిడెంట్ (Fire Accident) గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 11 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ మీటర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ వివరించారు. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు (four students) గాయపడ్డారు. మిగిలిన వారిని సురక్షితంగా కిందకు దించామని తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వివరించారు.