Brij Bhushan: బీజేపీ ఎంపీ, డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ (Brij Bhushan) రెజ్లర్లనే కాదు.. మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తిస్తారు. తనకు అనుకూలంగా కొశ్చన్స్ లేకుంటే అంతే సంగతులు. అవును రెజ్లర్ల లైంగిక వేధింపుల గురించి ప్రశ్న వేయడంతో రిపోర్టర్‌తో దురుసుగా పవర్తించాడు. పోలీసులు మీపై చార్జీషీట్ దాఖలు చేశారు. నేరం రుజువైతే ఎంపీ పదవీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధిపై చిందులు వేశారు. తనేందుకు రాజీనామా చేస్తాను.. తన పదవీ రాజీనామా గురించి ఎందుకు అడుగుతున్నారు అని అసహనం వ్యక్తం చేశారు.
రెజ్లర్లపై వేధింపులకు సంబంధించి మీపై చార్జీషీట్ ఫైల్ అయ్యాయని.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రిపోర్టర్‌ను ఉరిమి చూశాడు. షటప్ అంటూ కారు ఎక్కడానికి ట్రై చేశాడు. జవాబు చెప్పాలని మైక్‌ను కారు డోరులో పెట్టారు. కోపంతోపై మైక్‌పై నుంచి డోర్ గట్టిగా వేశాడు. దీంతో రిపోర్టర్ చేతికి గాయం అయ్యింది. మైక్ విరిగిపోయింది. అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేశారు. ఇంకేముంది వైరల్ అవుతుంది.
మహిళ రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఆరు కేసుల్లో 108 మంది సాక్షులను విచారించారు. బ్రిజ్ భూషణ్ శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జీషీట్లో పేర్కొన్నారు. నేరం రుజువు అయితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.