తగ్గేదేలే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్.. అన్నట్టుగానే మరోసారి దుమ్ముదులుపుతున్నాడు పుష్పరాజ్. అయితే ఈ సారి విదేశి గడ్డపై హల్చల్ చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ సంచలనంగా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప డైలాగ్స్ ఎంతగానో పాపులర్ అయ్యాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. డిసెంబర్ 8న రష్యన్ భాషలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రష్యాలోని 24 నగరాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. దాంతో ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం.. అల్లు అర్జున్, సుకుమార్, రష్మికతో పాటు మిగతా పుష్ప టీమ్ కూడా రష్యాలో ల్యాండ్ అయిపోయింది. అక్కడ వీళ్లకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఇక రష్యాలో పుష్ప టీమ్ చేస్తున్న సందడి మామూలుగా లేదు. డిసెంబర్ 1న జరిగిన, 3న జరగనున్న ప్రీమియర్ షోల కోసం రచ్చ చేస్తున్నారు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సందడి చేస్తున్నారు. బన్నీ, రష్మిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ప్రెస్‌మీట్ తర్వాత దిగిన ఓ ఫొటోను.. అల్లు అర్జున్ తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. రష్యాలో పుష్ప క్యాప్షన్‌తో ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇక రష్మిక అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దాంతో పుష్ప2 పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. త్వరలోనే ‘పుష్ప 2’ రెగ్యూలర్ షూట్ మొదలు కానుంది. మరి రష్యాలో పుష్ప మూవీ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.