లైగర్ సినిమా పూరి జగన్నాథ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ను తలకిందులు చేసేసింది. లైగర్ హిట్ అయి ఉంటే.. పూరి లైన్లో ఉన్న సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే లైగర్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందో.. పూరికి సీన్ రివర్స్ అయింది. దాంతో ఇప్పటికే సెట్స్ పై ఉన్న జనగణమనకు బ్రేక్ తప్పదంటున్నారు. లైగర్ సెట్స్‌పై ఉండగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు పూరి. ఇప్పటికే ‘జనగణమన’ ఒకటి అర షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకునట్టు టాక్. అయితే లైగర్ హిట్టయితే.. ఈ పాటికే రెట్టించిన ఉత్సాహంతో పూరి టీం తిరిగి జగనణమన సెట్స్‌లో ఉండేది. కానీ ఇప్పుడు జనగణమన ప్రాజెక్ట్ డైలమాలో పడిపోయిందని అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జేజిఎంను పక్కకు పెట్టడమే మంచిదని భావిస్తున్నారట పూరి మరియు విజయ్ దేవరకొండ. ఈ ప్రాజెక్ట్ తెరకెక్కాలంటే భారీ బడ్జెట్ అవసరం. కాబట్టి లైగర్ దెబ్బకు అంత రిస్క్ చేయడం కరెక్ట్ కాదనే ఆలోచనలో ఉన్నారట. అందుకే పూరి మైండ్‌లో కొత్త కథ రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ముంబైలో కొత్త స్క్రిప్టు రాసే పనిలో ఉన్నట్టు టాక్. అయితే అది ఇస్మార్ట్ శంకర్ 2 అయి ఉండొచ్చనే ఊహాగానాలొస్తున్నాయి. పూరికి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్.. మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మాసివ్ సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ సినిమా రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అందుకే గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందనున్నారు. కానీ ఇప్పుటు లైగర్ ఎఫెక్ట్ వల్ల.. ముందుగా ఈ సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట పూరి. ఈ లోపు విజయ్ కూడా ఖుషీతో పాటు మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుందని అంటున్నారు.