Prasanth Varma: ‘జై హనుమాన్’ కంటే ముందు మరో సినిమా?
హనుమాన్ సినిమా ప్రస్తుతం ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన హనుమాన్ సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కానీ దీనికంటే ముందు మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.
Prasanth Varma: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా.. ఏకంగా ఓ పెద్ద హీరో పాన్ ఇండియా సినిమా రేంజ్లో 350 కోట్లు కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. హనుమాన్ క్లైమాక్స్‌లో జై హనుమాన్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. హనుమాన్ హిట్ జోష్‌లో వెంటనే జై హనుమాన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తామని 50 డేస్ ఫంక్షన్లో చెప్పుకొచ్చాడు.
వచ్చే ఏడాదిలోనే జై హనుమాన్ రిలీజ్ చేస్తామని చెప్పాడు. కానీ నెక్స్ట్ ప్రశాంత్ వర్మ నుంచి వచ్చే కొత్త సినిమా హనుమాన్ కాదని తెలుస్తోంది. ఆక్టోపస్ అనే సినిమాను ముందుగా ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. నిజానికైతే.. హనుమాన్ కంటే ముందే ఆక్టోపస్ మొదలైంది. షూటింగ్ దాదాపుగా పూర్తయిన తరవాత ‘హనుమాన్’ని పట్టాలెక్కించాడు ప్రశాంత్. దీంతో.. ఇప్పుడు మళ్లీ ‘ఆక్టోపస్’పై దృష్టి పెట్టాడట ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాటు మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతే.. జై హనుమాన్ మొదలు పెట్టబోతున్నాడట ప్రశాంత్. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.