ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. దాంతో కెజియఫ్కు మించి సలార్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్‌ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆదిపురుష్ జూన్‌కి పోస్ట్‌పోన్ అవడంతో.. సలార్ మరింత వెనక్కి వెళ్తుందని అనుకున్నారు. కానీ హోంబలే ఫిల్మ్స్ మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతునే ఉన్నారు. కాబట్టి సలార్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు. ప్రభాస్ కూడా సలార్‌కు డెడ్ లైన్ పెట్టాడట. ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్‌తో పాటు మారుతి సినిమాలను బ్యాలెన్స్డ్గా షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్. అయితే సలార్ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడట ప్రభాస్. మొత్తంగా దాదాపు 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. దాంతో మార్చిలో సలార్‌కు గుమ్మడి కాయ కొట్టాలని డిసైడ్ అయిపోయారట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నాడు. ఇక ప్రభాస్ వచ్చేసి.. ప్రాజెక్ట్ కె, మారుతి ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ చేయబోతున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డ వంగతో స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ప్రభాస్. ఏదేమైనా ప్రభాస్ లైనప్ అదిరిపోయిందని చెప్పొచ్చు.