బాహుబలి2లో వీడెక్కడున్న రాజేరా అనే డైలాగ్.. నిజ జీవితంలోను ప్రభాస్(prabhas)కు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు.. ఈ 20 ఏళ్లలో 20 సినిమాలు చేశాడు.. పాన్ ఇండియా స్టార్ డమ్ అనుభవిస్తున్నాడు.. అయినా కూడా ఏ మాత్రం కాంట్రవర్శీ లేని ఏకైక హీరో ప్రభాస్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో దాదాపుగా యాంటీ ఫ్యాన్స్ లేని హీరో ప్రభాస్ మాత్రమే.. అనేది మిగతా హీరోల అభిమానుల మాట. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ప్రభాస్.. వర్షంతో స్టార్డమ్ అందుకొని.. ‘ఛత్రపతి’తో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
ఆ తర్వాత బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్.. వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే 2013లో కొరటాల శివను దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన ‘మిర్చి’ మూవీ.. మాసివ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాంతో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తాడని భావించారు అంతా. కానీ డార్లింగ్ మాత్రం రాజమౌళితో బాహుబలి కమిట్ అయ్యాడు. ఆ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు సమయాన్ని కేటాయించాడంటే.. ప్రభాస్ వర్క్ డెడికేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నాడు ప్రభాస్.
ఆ తర్వాత అంతకుమించి అనేలా.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల్లో నటిస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. అయినా కూడా ప్రభాస్ సింప్లిసిటీ ముందు ఎవరైనా దిగదుడుపే. ఇక ప్రభాస్ ఆతిథ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తంగా ప్రభాస్.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే ఆరడుగుల అందగాడు.. రియల్ రాజు.. ఆతిథ్యంలో రారాజు.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. ఈ రోజు, అంటే అక్టోబర్ 23న.. ప్రభాస్ బర్త్ డేకు మించిన అసలైన పండగ.. అభిమానులకు మరోటి లేదని చెప్పొచ్చు.