ఇటీవలె ప్రభాస్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ పై పాజిటివ్ కంటే నెగెటివ్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. ఊహించిన స్థాయిలో ఈ టీజర్ లేదని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ టీజర్‌ను త్రీడిలో చూస్తే.. ఆ ఫీల్ వేరుగా ఉంటుందని.. ఇదో విజువల్ వండర్ మూవీ అని చెబుతున్నాడు దర్శకుడు ఓం రౌత్. అందుకే ఫ్యాన్స్ కోసం స్పెషల్ త్రీడి స్క్రీనింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 23న, ప్రభాస్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన సినిమాలను రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.
మహేష్ ‘పోకిరి’, పవన్ ‘జల్సా’, బాలయ్య ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలు రీ రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేశాయి. అందుకే ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే హిట్ ప్రభాస్ సినిమాలను రీ రిలీజ్ చేస్తారనుకుంటే.. ఓ ఫ్లాప్ మూవీని రిలీజ్ చేస్తుండడం విశేషం.
కానీ దానికో బలమైన కారణం ఉంది. ప్రభాస్ నటించిన ‘రెబల్’ మూవీ ఈ ఏడాదితో పదేళ్లు పూర్తి చేసుకుంది. లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక రోల్ చేశారు. ఇటీవలె కృష్ణం రాజు కాలం చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. అక్టోబర్ 15న, రెబల్‌ను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా.. ఫైట్స్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయి. అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ మరోసారి రెబల్‌ను థియేటర్లో చూసేందుకు రెడీ అవుతున్నారు. మరి రెబల్ మరోసారి ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.